మంథని సిడిపిఓ పద్మశ్రీ  అక్రమాలపై పిడి విచారణ

మంథని సిడిపిఓ పద్మశ్రీ  అక్రమాలపై పిడి విచారణ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:- మంథని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మశ్రీ అక్రమాలపై కొందరు సూపర్వైజర్లు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం జిల్లా పీడీ రాఫ్ ఖాన్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇద్దరు సూపర్వైజర్లు మంథని ప్రాజెక్టులో పని చేస్తున్న స్వరూప అనే సూపర్వైజర్ ఏప్రిల్, మే నెలలో విధులకు హాజరు కాకుండా జీతం చేసి డబ్బులు చెల్లించారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విచారణ చేపట్టగా ఇద్దరు సూపర్వైజర్లు మాత్రం తామే ఫిర్యాదు చేసినట్టు పిడికి వాంగ్మూలం ఇచ్చినప్పటికీ లిఖితపూర్వకంగా తెలుపలేదని పిడి పేర్కొన్నారు.  ఫిబ్రవరి 6 నుండి మార్చి 4 వరకు మంథని సిడిపిఓ సెలవు లో ఉంటూ రజిత అనే సూపర్వైజర్ కు ఇన్చార్జి సిడిపిఓగా బాధ్యతలు అప్పగించిన కార్యాలయానికి సంబంధించిన కారును మాత్రం స్వాధీన పరచలేదు. దీనిపై కూడా పిడి విచారణ చేపట్టారు.  అంతేకాకుండా కార్యాలయానికి సంబంధించిన కారు ఇంచార్జి సిడిపిఓ కు స్వాధీన పరచలేదని సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. విధులకు హాజరు కాకుండా జీతం చేయడం కార్యాలయానికి సంబంధించిన కారును స్వాధీనపర్చకపోవడం సరైనది కాదని జిల్లా కలెక్టర్ కు తగు నివేదికను అందిస్తానని విలేకరులకు  పీడీ తెలిపారు.